Rohit Sharma: పంజాబ్ కింగ్స్‌తో బుధవారం కీలక మ్యాచ్ సందర్భంగా ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బ్యాట్ ఝుళిపించాలని అన్నాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ముంబయి ఓటమిపాలైంది. బౌలింగ్ వైఫల్యాలు బయటపడ్డాయి. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు వికెట్ల కోసం జస్ప్రీత్ బుమ్రాపై అధికంగా ఆధారపడుతోందని సెహ్వాగ్ ఇటీవలే ఓ క్రీడా ఛానెల్‌తో అన్నాడు.
"టాస్ ఓడిపోతే చెన్నై లాగే ముంబయి కూడా తమ బౌలర్ల కోసం అదనపు పరుగులు చేయాలి. తమ బౌలింగ్ బలానికి 160-170 పరుగులు ఏమాత్రం సరిపోవు. బుమ్రా ఒక్కడే అంతా చేయాలంటే కష్టం. రోహిత్.. బ్యాటింగ్‌కు దిగినప్పుడు కెప్టెన్ అనే విషయం మరిచిపోవాలి. తను హిట్‌మ్యాన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి."
-వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్
ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 80 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్. ఇక డెత్ ఓవర్ల వరకు కనీసం ముగ్గురు బ్యాటర్లు ఉండేలా చూసుకోవాలని ముంబయికి సూచించాడు భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్. గత మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడని, మిగిలిన బ్యాటర్లు కూడా కాస్త బాధ్యత తీసుకోవాలని అన్నాడు.