తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2022, 7:20 AM IST

ETV Bharat / sports

'కెప్టెన్సీ ఒత్తిడితోనే ఐపీఎల్​లో రోహిత్​ శర్మ విఫలం'

Rohit Sharma IPL 2022: ఐపీఎల్​ 15వ సీజన్​లో ముంబయి ఇండియన్స్​ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. జట్టును విజయ తీరాలకు చేర్చటంలో కెప్టెన్​ రోహిత్​ శర్మ విఫలమవుతున్నాడు. అయితే.. మూడు ఫార్మాట్లలో టీమ్​ఇండియాకు సారథ్యం వహిస్తున్నందునే రోహిత్​ శర్మపై మానసిక ఒత్తిడి ఉందని, ఆ ప్రభావం ఐపీఎల్​పై చూపుతోందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ గ్రేమ్​ స్మిత్​ అభిప్రాయపడ్డాడు.

Rohit Sharma IPL 2022
కెప్టెన్​ రోహిత్​ శర్మ, గ్రేమ్​ స్మిత్​

Rohit Sharma IPL 2022: మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు సారథ్యం వహిస్తున్న రోహిత్‌ శర్మపై మానసిక ఒత్తిడి.. ప్రభావం చూపిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో అయిదు సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఈసారి తొలి 5 మ్యాచ్‌ల్లో ఓడింది. వరుస ఓటములతో సతమతమయ్యేందుకు రోహిత్​ శర్మ ఒత్తిడికి గురి కావటమేనని పేర్కొన్నాడు స్మిత్​.

"టీమ్‌ఇండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారిన తర్వాత ముంబయికి రోహిత్‌ సారథ్యం వహిస్తుండటం ఇదే తొలిసారి. ఆ మానసిక ఒత్తిడి ఐపీఎల్‌లో ప్రభావం చూపుతోందా? టాప్‌ ఆర్డర్‌లో రోహిత్‌ ఒక శక్తి. శుభారంభం అందించి.. ప్రతి ఒక్కరు ఆడేలా చేస్తాడు. అతను పరుగులు చేస్తున్నప్పుడు ముంబయి చాలాసార్లు గెలిచింది. బ్యాటింగ్‌ లైనప్‌లో రోహిత్‌ అత్యంత కీలక ఆటగాడు. కాని ఇప్పటి వరకు అతను ఫామ్‌ను దొరకబుచ్చుకోలేదు. కిషన్‌, గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్‌, పవర్‌ ఫినిషర్‌ పొలార్డ్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో ఉన్నారు. బ్రెవిస్‌ కూడా ఉన్నా అతను కుర్రాడు. మొత్తంగా ముంబయికి బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా గెలవలేకపోతోంది"

- గ్రేమ్​ స్మిత్​, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​.

ఐదు మ్యాచుల్లో ఓటమి:ఐపీఎల్​ మెగా టోర్నీలో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబయి ఇండియన్స్​ ఈ ఏడాది సీజన్​లో అత్యంత పేలవ ప్రదర్శనతో డీలా పడింది. తొలి ఐదు మ్యాచుల్లో ఓటమి చెందింది. బుధవారం పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 199 పరుగులు భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 186 పరుగులకే పరిమితమైంది. ముంబయి బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవీస్ 25 బంతుల్లోనే 49 పరుగుల మెరుపు ఇన్నింగ్స్​, సూర్యకుమార్​ యాదవ్​ కీలక ఇన్నింగ్స్​ సైతం జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. పంజాబ్​ కింగ్స్​ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో ముంబయి బ్యాటర్లు తేలిపోయారు. అంతకు ముందు బ్యాటింగ్​ చేసిన పంజాబ్​ ఓపెనర్లు మయాంక్​ అగర్వాల్​, శిఖర్​ ధావన్​లు తొలి వికెట్​కు 97 పరుగులు భాగస్వామ్యాన్ని నిలిపి జట్టుకు గట్టి పునాదులు వేశారు. ఆ తర్వాత వచ్చిన పంజాబ్​ బ్యాటర్లు దానిని కొనసాగించి భారీ స్కోర్​ సాధించటంలో సఫలమయ్యారు.

ఇదీ చూడండి:IPL 2022: ఐదు సార్లు ఛాంపియన్​కు ఐదో ఓటమి..

ఈ స్టార్​ క్రికెటర్లు వాళ్ల భార్యల కన్నా చిన్నోళ్లు

Six Wickets in an Over: ఒకే ఓవర్లో 6 వికెట్లు..చరిత్ర సృష్టించిన బౌలర్​

ABOUT THE AUTHOR

...view details