తెలంగాణ

telangana

ETV Bharat / sports

హెల్మెట్ ధరించి బౌలింగ్.. ఎప్పుడైనా చూశారా? - హెల్మెట్ ధరించి బౌలింగ్

Rishi Dhawan New Helmet: క్రికెట్​లో బ్యాటర్లు హెల్మెట్ వాడటం సహజమే. అంపైర్లు సైతం రక్షణగా హెల్మెట్లు, గార్డులు ఉపయోగిస్తుంటారు. కానీ బౌలర్లు హెల్మెట్ వాడటం ఎప్పుడైనా చూశారా?

rishi dhawan helmet
rishi dhawan helmet

By

Published : Apr 25, 2022, 10:55 PM IST

Rishi Dhawan New Helmet: సాధారణంగా క్రికెట్​లో బ్యాటర్ హెల్మెట్లు వాడుతుంటారు. వేగంగా వచ్చే బంతులు తలకు నేరుగా తగలకుండా ఉండేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇక ఫీల్డింగ్ జట్టులోని ఆటగాళ్లు సైతం కొన్నిసార్లు హెల్మెట్లు ఉపయోగిస్తుంటారు. బ్యాటర్​కు దగ్గరగా ఫీల్డింగ్ చేసినప్పుడు రక్షణగా వీటిని పెట్టుకోవడం మనం చూస్తుంటాం. ఇక.. ఈ మధ్య అంపైర్లు సైతం రక్షణగా గార్డులను వాడుతున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. బౌలర్లు ఎప్పుడైనా హెల్మెట్లు వాడటం చూశారా? లేదు కదా? సోమవారం మ్యాచ్​లో అదే జరిగింది.

తలకు గార్డుతో రిషి ధావన్
రిషి

పంజాబ్ బౌలర్ రిషి ధావన్.. ముఖానికి ఓ గార్డు పెట్టుకొని బౌలింగ్ చేశాడు. టీవీలో రిషి అవతారాన్ని చూడగానే చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. హెల్మెట్ లాంటి పరికరాన్ని పెట్టుకున్న రిషిని చూసి.. నెటిజన్లు వెంటనే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. 'అది హెల్మెటా? లేకా మాస్కా?' అంటూ ట్వీట్లు చేశారు. అయితే, రక్షణ కోసమే రిషి గార్డును ఉపయోగించినట్లు తెలుస్తోంది.

వికెట్ తీసిన ఆనందంలో రిషి

ABOUT THE AUTHOR

...view details