త్వరలో మొదలయ్యే ఐపీఎల్ రెండో దశలోనూ(IPL 2021) దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్(rishabh pant captaincy) ఉంటాడని యాజమాన్యం స్పష్టం చేసింది.
రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(shreyas iyer replacement delhi capitals) గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను సారథిగా నియమిస్తూ అప్పుడు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా.. వాయిదా పడగా, ఇప్పుడు రెండో దశకు శ్రేయస్ కోలుకుని జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే పంత్ కెప్టెన్సీ కొనసాగిస్తాడని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.