కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ రెండో దశ(IPL Second Phase 2021) ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమైపోయింది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ తలపడగా.. సోమవారం(సెప్టెంబరు 20) రెండో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైడ్రైడర్స్(RCB Vs KKR 2021) జట్లు తలపడనున్నాయి. మొదటగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.
కోహ్లీ కెప్టెన్సీలో టైటిల్ దక్కేనా?
ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy RCB) ఆర్సీబీకి అందని ద్రాక్షగానే మిగిలింది. టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా వైదొలగనున్న ఆర్సీబీ సారథి కోహ్లీ.. ఈ సీజన్ తర్వాత ఈ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుంచీ తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈసారి టైటిల్ నెగ్గి కోహ్లీకి బహుమతిగా ఇవ్వాలని ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
చివరిగా.. 2014 టైటిల్ పోరులో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలుపొంది(KKR IPL wins) ట్రోఫీ సాధించిన ఘనచరిత్ర కేకేఆర్ సొంతం. మరి నేటి మ్యాచ్లో ఎలా రాణిస్తుందో
తెలుగు ఆటగాడికి చోటు
ఆర్సీబీ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. ఇందులో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ కూడా ఉన్నాడు. అలాగే శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగకూ చోటిచ్చారు. కాగా, కోల్కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్కూ స్థానం కల్పించారు. ఇతడికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్.