తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఆర్‌సీబీ.. ప్లేఆఫ్స్‌లో అడుగేస్తుందా? - IPL 14 season match today

ఆదివారం పంజాబ్​ కింగ్స్​తో(PBKS vs RCB) తలపడేందుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు. ఈ మ్యాచ్​లో గెలిస్తే.. ప్లే ఆఫ్​ బెర్తు ఖరారు చేసుకుంటుంది కోహ్లీ సేన.

RCB
ఆర్​సీబీ

By

Published : Oct 3, 2021, 9:13 AM IST

Updated : Oct 3, 2021, 2:20 PM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు(RCB vs PBKS) మరికాసేపట్లో కీలక పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ ఎంతో కీలకం. ఇందులో విజయం సాధిస్తే కోహ్లీసేన ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికే 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. పంజాబ్‌ను ఓడిస్తే ఏ అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్తుంది. మరోవైపు పంజాబ్‌ 10 పాయింట్లతో కొనసాగుతుండటంతో టాప్‌4లో నిలవాలంటే ఈ మ్యాచ్‌ తప్పక గెలవాలి.

గత మ్యాచ్‌ల పరిస్థితి?

యూఏఈలో(IPL 2021) లెగ్‌లో కోహ్లీసేన తొలి రెండు మ్యాచ్‌లు ఓటమిపాలైనా తర్వాత బలంగా పుంజుకొంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. గతవారం ముంబయి, రాజస్థాన్‌ను ఓడించి ఇప్పుడు పంజాబ్‌ను కూడా మట్టికరిపించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ టీమ్‌ను ఓడించాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. మరోవైపు పంజాబ్‌ది విచిత్ర పరిస్థితి. రెండో దశలో ఈ జట్టు కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచినా.. ఒక ఓటమి, ఒక విజయం, మరో ఓటమి, మరో విజయం ఇలా నిలకడలేమి ప్రదర్శన చేస్తోంది. దీంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న కోహ్లీసేనను ఓడించడం పంజాబ్‌కు కష్టమనే చెప్పాలి.

బెంగళూరు బలమేంటి?

రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టులో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఒకరు పోయినా ఇంకొకరు ఆదుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓపెనర్లు కోహ్లీ, దేవ్‌దత్‌తో పాటు కొత్తగా ఆడుతున్న శ్రీకర్‌ భరత్‌ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇక తర్వాత వచ్చే గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ధాటిగా ఆడుతూ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. మరోవైపు డివిలియర్స్‌ ఒక్కడే పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. అతడు కూడా ఫామ్‌ అందుకుంటే పంజాబ్‌కు కష్టాలు తప్పవనే చెప్పాలి. ఇక బౌలింగ్‌లో హర్షల్‌ పటేల్‌ టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతడికి చాహల్‌, సిరాజ్‌ నుంచి సహకారం అందితే ఈ విభాగంలోనూ బెంగళూరుకు తిరుగుండదు.

పంజాబ్‌ కథ మారేనా?

పంజాబ్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఆ జట్టుకు శుభారంభాలు అందిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిద్దరూ ధాటిగా ఆడుతూ సగం భారం తమ మీదే మోస్తున్నారు. అయితే, తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ సరిగా ఆడకపోవడంతోనే అసలు సమస్య ఎదురవుతోంది. గత మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడిన సందర్భంగా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌ హిట్టింగ్‌ చేయడంతో సరిపోయింది కానీ, లేదంటే ఆ మ్యాచ్‌లోనూ పంజాబ్‌ ఓటమిపాలయ్యేదే! ఇప్పటికే క్రిస్‌గేల్‌ జట్టును వీడిపోగా మరోవైపు నికోలస్‌ పూరన్‌ పూర్తిగా తేలిపోతున్నాడు. ఇక ఎయిడిన్‌ మార్‌క్రమ్‌ తనవంతు పరుగులు చేస్తున్నా భారీ ఇన్నింగ్స్‌ ఆడితే జట్టుకు ఉపయుక్తంగా ఉంటుంది. చివరగా బౌలింగ్‌ విభాగంలో పంజాబ్‌ బలంగా కనిపిస్తోంది. అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్‌ షమి, రవిబిష్ణోయ్‌ ప్రత్యర్థుల పని పడుతూ తమవంతు సహకారం అందిస్తున్నారు. ఏదేమైనా మిడిల్‌ ఆర్డర్‌ రాణిస్తేనే పంజాబ్‌కు నేటి మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం ఉంది. లేకపోతే ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతే.

ఇదీ చదవండి:

దంచికొట్టిన రాజస్థాన్‌.. ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

Last Updated : Oct 3, 2021, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details