రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ డేనియల్ క్రిస్టియన్‌కు ఫ్రాంచైజీ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. ఇతడితో పాటు పేసర్ కైల్ జేమిసన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారట. అతడు కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం ద్వారా ఫ్రాంచైజీ నిబంధనలు ఉల్లఘించిన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ వీడియోను డెలిట్ చేసింది ఆ సంస్థ.
కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో తొలగింపు! - కోహ్లీ కైల్ జేమిసన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు డేనియల్ క్రిస్టియన్, కైల్ జేమిసన్‌కు ఫ్రాంచైజీ వార్నింగ్ ఇచ్చిందని సమచారం. కోహ్లీపై ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
విషయమేంటంటే.. ది గ్రేడ్ క్రికెటర్ అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆర్సీబీ క్రికెటర్లు డేనియన్ క్రిస్టియన్, కైల్ జేమిసన్ పాల్గొన్నారు. ఇందులో జేమిసన్.. ప్రస్తుతం కోహ్లీ దృష్టంతా టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌పైనే ఉందని, అందుకే అతడు డ్యూక్ బంతితో బౌలింగ్ చేయమని కోరాడని వెల్లడించాడు. అలాగే క్రిస్టియన్.. కోహ్లీ కేవలం కొన్ని టీమ్ మీటింగ్‌లకు మాత్రమే హాజరవుతాడని చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన ఫ్రాంచైజీ వీరివురికి వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే డేనియల్ స్వయంగా ఈ వీడియోను తొలగించాలని ఆ ఛానెల్‌ను కోరాడు. ఈ విషయాన్ని ఆ ఛానెల్ వ్యాఖ్యాత అయిన సామ్ పెర్రీ ధ్రువీకరించారు. ఇది ఐపీఎల్ నిబంధనలకు విరుద్దమని, అందుకే దానిని తొలగించమని క్రిస్టియన్ కోరినట్లు సామ్ తెలిపారు.