సెప్టెంబరులో దుబాయి వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ (IPL 2021) రెండో దశకు జట్లన్నీ సిద్ధమవుతున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భారీ మార్పులు చేసింది. ప్రస్తుతం జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్న సైమన్ క్యాటిచ్ వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాడు. ఆ స్థానంలో మైక్ హెస్సన్ బాద్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ శనివారం వెల్లడించింది.
ఆటగాళ్లలో డేనియల్ శామ్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన దుష్మంత చమీరా, ఫిన్ అలెన్ స్థానంలో సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్‌లు జట్టులోకి రానున్నారు. స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగను ఫ్రాంచైజ్ నియమించింది. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన హసరంగపై ఆర్సీబీకి భారీ అంచనాలు ఉన్నాయి. హసరంగపై తమకు ఎప్పటినుంచో దృష్టి ఉందని వెల్లడించారు ఆర్సీబీ కొత్త కోచ్ హెస్సన్.