చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా, ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా కెప్టెన్ ధోనీతో తీసుకున్న కొన్ని ఫొటోల్ని ట్వీట్ చేయడం సహా ఆసక్తికర కామెంట్ పెట్టాడు.
ధోనీని కలిసిన జడేజా.. ఆసక్తికర ట్వీట్ - cricket news
బయోబబుల్‌లో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో జడేజా కలిశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని వెల్లడించాడు. కెప్టెన్ ధోనీతో కలిసున్న ఫొటోల్ని పోస్ట్ చేశాడు.
జడేజా ధోనీ
"మహేంద్ర సింగ్ ధోనీని ఎప్పుడు కలిసినా మొదటిసారి అతడ్ని కలిసినట్లు అనిపిస్తుంది. 2009లో తొలిసారి అతడి కలిసినప్పుడు ఎలాంటి ఉత్సాహంతో ఉన్నానో ఇప్పుడు అదే ఫీలింగ్" అని రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు.
ఏప్రిల్ 10న తన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది చెన్నై సూపర్‌కింగ్స్. గతే సీజన్లో ప్రదర్శనకు దీటుగా ఈ సీజన్ ఆడాలని ధోనీ సేన భావిస్తోంది.