Ravi Shastri on Shubman Gill: టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్లో ఎంతో ప్రతిభ ఉందన్నాడు మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి. అతడు ప్రపంచలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడని కొనియాడాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆరంభంలో లఖ్‌నవూ జట్టుతో జరిగిన తొలి మ్యాచులో శుభ్‌మన్ డకౌట్ అయ్యాడు. అయితే, శనివారం దిల్లీతో జరిగిన రెండో మ్యాచులో అతడు గొప్పగా పుంజుకున్నాడు. శుభ్‌మన్ (84) పరుగులతో రాణించి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
"శుభ్‌మన్‌లో గొప్ప నైపుణ్యం ఉంది. ప్రస్తుత తరం ప్రపంచ స్థాయి క్రికెటర్లలో అతడు అత్యుత్తమ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే చాలా సులభంగా పరుగులు చేయగలడు. దాంతో పాటు అతడి షాట్ సెలెక్షన్, స్ట్రైక్ రోటేట్ చేసే విధానం చాలా బాగుంటుంది. శుభ్‌మన్ దిల్లీతో జరిగిన మ్యాచులో 46 బంతులు ఎదుర్కొంటే.. అందులో 6 బంతులు మాత్రమే డాట్ అయ్యాయి. చెత్త బంతులను వదిలేస్తూ.. షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతడు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు"