తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైఫల్యాలపై దృష్టి సారించాలి: సంగక్కర

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ మరింత మెరుగవ్వాలని సూచించాడు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర. ఇంకా అనేక మ్యాచ్​లు ఆడాల్సి ఉన్నందున తమ వైఫల్యాలపై దృష్టిసారించాలని చెప్పాడు.

By

Published : Apr 24, 2021, 10:37 AM IST

Sangakkara
సంగక్కర

రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో టాప్‌ నలుగురిలో ఒకరు దంచికొట్టాలని, భారీ స్కోర్లు చేయాలని ఆ జట్టు డైరెక్టర్‌ కుమార సంగక్కర అభిప్రాయపడ్డాడు. నేడు కోల్​కతా నైట్​రైడర్స్​తో అమీతుమీ తేల్చుకోనుంది రాజస్థాన్. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో మూడింటిలో ఓడిందీ జట్టు. ఈ నేపథ్యంలోనే స్పందించాడు సంగక్కర.

"మా బ్యాటింగ్‌ లైనప్‌ బలగాన్ని చూస్తే విలువైన భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది. టాప్‌ నలుగురిలో ఒకరు భారీ ఇన్నింగ్స్‌ ఆడాలి. పవర్‌ప్లేలో చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. ఒకరిద్దరు భారీ పరుగులు చేయాలి. దురదృష్టం కొద్దీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో అలా ఆడలేకపోయాం. మిడిల్‌, లోయర్‌ బ్యాట్స్‌మెన్‌ బాగా ఆడారు. మేం బ్యాటింగ్‌లో కలిసి కట్టుగా ఆడాలి. కేవలం బౌలింగ్‌, ఫీల్డింగ్‌ బాగా చేస్తే సరిపోదు. ఆటలోని ప్రణాళికలు అమలుపరిచే విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లే పూర్తయ్యాయి. ఇంకా అనేక మ్యాచులు ఆడాల్సి ఉండటం వల్ల మా వైఫల్యాలపై దృష్టిసారించాల్సి ఉంది" అని సంగక్కర చెప్పుకొచ్చాడు.

నేడు కోల్​కతా నైట్​రైడర్స్​తో పోరులో తలపడనుంది రాజస్థాన్. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్​లు ఆడిన కేకేఆర్ మొదటి మ్యాచ్​లో గెలిచి మిగతా మూడింటిలో పరాజయం పాలైంది. దీంతో ఈ జట్టు కూడా గెలుపు కోసం ఆరాటపడుతోంది.

ABOUT THE AUTHOR

...view details