Rajasthan Royals: బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నీల్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్ హైదరాబాద్‌తో తలపడిన సమయంలో చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా నాథన్ గాయపడ్డాడు. 34 ఏళ్ల ఈ క్రికెటర్ స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లనున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది.
" ఇది దురదృష్టకరం. నాథన్‌కు వీడ్కోలు పలకటం చాలా కష్టమైన పని. జట్టులోంచి ఒకరికి దూరం కావటం ఎప్పుడూ కష్టమే. ముఖ్యంగా గాయం కారణంగా దూరమైనప్పుడు. ఈ టోర్నీ మొత్తం నీతో పూర్తి సమయం గడపాలని మేమంతా అనుకున్నాం. దురదృష్టవశాత్తు అది జరగటం లేదు. అయినా.. నీవు మాలో ఒకడివి. మా నుంచి ఏ అవసరం ఉన్నా ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మాతో తిరిగి కలవాలని కోరుకుంటున్నా."