ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్.. స్వదేశానికి వెళ్లిపోయాడు. సుదీర్ఘ కాలంగా బయో బబుల్‌లో ఉండి విసిగిపోయిన అతడు.. ఈ సీజన్‌కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు.
లివింగ్‌స్టోన్ నిర్ణయాన్ని గౌరవించి, అతడు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతించామని, తమ మద్దతు అతడికి ఉంటుందని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే గాయాల కారణంగా బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది రాజస్థాన్.