తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాజస్థాన్​కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌ - స్టోక్స్

రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్​రౌండర్​ బెన్ స్టోక్స్ సీజన్​ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్​తో మ్యాచ్​లో క్రిస్​ గేల్​ క్యాచ్​ పడుతూ గాయపడ్డాడు స్టోక్స్​.

ben stokes, rajasthan royals player
బెన్ స్టోక్స్, రాజస్థాన్ రాయల్స్​ ఆల్​రౌండర్

By

Published : Apr 14, 2021, 8:01 AM IST

ఇప్పటికే ఐపీఎల్‌లో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ సేవలను కోల్పోయిన రాజస్థాన్‌ రాయల్స్‌కు మరో పెద్ద ఎదురు దెబ్బ. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో క్రిస్‌ గేల్‌ క్యాచ్‌ను పట్టే క్రమంలో ఈ ఇంగ్లాండ్‌ ఆటగాడి వేలుకి గాయమైంది. మంగళవారం చేసిన వైద్య పరీక్షల్లో అతడి వేలు విరిగినట్లు వెల్లడైంది. గాయం తీవ్రత ఎంత.. అతడు ఎన్ని రోజులు క్రికెట్​కు దూరం అయ్యే పరిస్థితి ఉంటుందనే వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇదీ చదవండి:'బాగా ఆడితే హీరోలా చూస్తారు.. కానీ ఇప్పుడు'

పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట ఒక క్యాచ్‌ వదిలిపెట్టిన స్టోక్స్‌.. ఆ తర్వాత గేల్‌ ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ చేస్తూ పట్టాడు. కానీ వెంటనే చేతిని విదిలించుకుంటూ ఇబ్బందిగా కనిపించాడు. ఆ తర్వాత అలాగే ఫీల్డింగ్‌, బౌలింగ్‌ చేశాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా దిగి ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే ఔటయ్యాడు. "పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఎడమ వేలికి గాయమైంది. వైద్య పరీక్షల్లో అతడి వేలు విరిగినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్‌ మొత్తానికి బెన్‌ దూరమయ్యాడు. రాజస్థాన్​ జట్టుకు స్టోక్స్​ ఎంతో విలువైన ఆటగాడు. మ్యాచ్‌లు ఆడకపోయినా ఇక్కడే ఉండి మైదానం బయట నుంచి బెన్‌ సలహాలు ఇవ్వబోతున్నాడు" అని రాయల్స్‌ తెలిపింది.

ఇదీ చదవండి:205 మ్యాచ్​ల్లో 2 సార్లు మాత్రమే ముంబయిపై అలా..

ABOUT THE AUTHOR

...view details