పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్.. అపెండిసైటిస్ ఆపరేషన్ కారణంగా ఆదివారం రాత్రి, దిల్లీ క్యాపిటల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ వెల్లడించింది.
దిల్లీతో మ్యాచ్‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరం - KL rahul absence with delhi capitals match
పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. చిన్న సర్జరీ కారణంగా అతడు దిల్లీతో మ్యాచ్ ఆడట్లేదని తెలిపింది ఫ్రాంచైజీ.
రాహుల్
ప్రస్తుతం అతడికి సర్జరీ చేయించేందుకు ముంబయికి తరలించినట్లు వెల్లడించింది. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా మయాంక్ అగర్వాల్‌ను నియమించినట్లు తెలిపింది. అయితే అతడు కోలుకుని తిరిగి జట్టుతో చేరడానికి దాదాపు పది రోజులు పడుతుందని సమాచారం.
Last Updated : May 2, 2021, 6:19 PM IST