పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లేపై(Anil Kumble Punjab Kings) ఆ జట్టు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌తో(PBKS vs RR 2021) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో జట్టు ఎంపిక సరిగ్గా లేదని, ఓటమికి కుంబ్లే కుంటి సాకులు చెబుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దిగ్గజ స్పిన్నర్‌ను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు త్వరలోనే కుంబ్లే టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా(Anil Kumble as Indian Coach) ఎంపికయ్యే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో బీసీసీఐ ఆ నిర్ణయం తీసుకునేముందు పునరాలోచించాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగింది..?
మంగళవారం రాత్రి పంజాబ్, రాజస్థాన్(PBKS vs RR) జట్లు తలపడ్డాయి. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ సంచలన విజయం సాధించింది. చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి చేతిలో 8 వికెట్లు ఉండగా నాలుగు పరుగులే అవసరమయ్యాయి. అప్పటికి మార్‌క్రమ్(26; 20 బంతుల్లో 2x4, 1x6), నికోలస్ పూరన్(32; 22 బంతుల్లో 1x4, 2x6) క్రీజులో ఉన్నారు. దీంతో అంతా ఆ జట్టే విజయం సాధిస్తుందని భావించారు. కానీ, ఆ ఓవర్‌లో కార్తీక్ త్యాగి మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక్క పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో రాజస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. తొలుత ఆ జట్టు 185 పరుగులు చేయగా ఛేదనలో పంజాబ్ 183/4 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్ మూడో బంతికి పూరన్.. శాంసన్ చేతికి చిక్కి ఔటయ్యాడు. తర్వాతి బంతికి దీపక్ హుడా(0) పరుగులు చేయలేదు. ఐదో బంతికి అతడూ ఔటవ్వడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠస్థితికి చేరింది. చివరి బంతికి పంజాబ్ మూడు పరుగులు చేయాల్సిన స్థితిలో ఫాబియన్ అలెన్(0) పరుగులు చేయలేకపోయాడు. దాంతో ఆ జట్టు ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో కుంబ్లేపై ఆ జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'బీసీసీఐ ఆలోచించాలి'