ముంబయి వేదికగా దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(51 బంతుల్లో 61), మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 69) అర్ధ సెంచరీలతో రాణించారు. దిల్లీ బౌలర్లలో మెరివాలా, వోక్స్, రబాడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
రాణించిన మయాంక్, రాహుల్- దిల్లీ లక్ష్యం 196 - delhi capitals
ముంబయి వేదికగా దిల్లీతో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కేెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దిల్లీ బౌలర్లలో మెరివాలా, వోక్స్, రబాడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.
పంజాబ్ కింగ్స్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ శుభారంభం చేసింది. తొలి వికెట్‌కు రాహుల్-అగర్వాల్ ఓపెనింగ్ జోడీ 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత కాసేపటికే రాహుల్, గేల్ ఔటయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా(13 బంతుల్లో 22), షారుక్ ఖాన్(5 బంతుల్లో 15) వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. మొదట పంజాబ్ బ్యాటింగ్ చూసిన వారేవరైనా స్కోరు సునాయాసంగా 200 దాటుతుందనిపించింది. కానీ, ఓపెనర్లు వికెట్ల అనంతరం రన్‌రేట్ మందగించింది.