తెలంగాణ

telangana

ETV Bharat / sports

అగ్రస్థానంపై కన్నేసిన కోహ్లీసేన.. పంజాబ్​పై గెలిచేనా? - బెంగళూరు స్క్వాడ్ టుడే

ఐపీఎల్​లో వరుస విజయాలతో దుసుకెళ్తోన్న​ బెంగళూరు, పంజాబ్​ జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్​ వేదికగా శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

Punjab Kings have task cut out against RCB
పంజాబ్​ X బెంగళూరు

By

Published : Apr 30, 2021, 8:56 AM IST

అహ్మదాబాద్​ వేదికగా శుక్రవారం జరగనున్న మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​తో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోహ్లీసేన.. ఈ మ్యాచ్​లో గెలిచి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు వరుస ఓటములతో సతమవుతోన్న పంజాబ్​.. ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని ప్లాన్స్ వేస్తోంది.

గెలుపు లాంఛనమేనా?

టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్​లో ఐదు విజయాలతో ఆర్సీబీ దూసుకెళ్తోంది. ఇటీవలే దిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లో ఒక పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పంజాబ్​పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని ప్రణాళికలను రచిస్తోంది.

సరిదిద్దుకుంటారా?

ఇటీవల కోల్​కతా జట్టు​తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైన పంజాబ్​ కింగ్స్​.. ఈ మ్యాచ్​తో తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్​ల్లో రెండింటిలో నెగ్గి నాలుగు మ్యాచ్​ల్లో ఓడి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్​ జట్టులో టాప్​ ఆర్డర్​ నుంచి బౌలింగ్​ లైనప్​ వరకు ఆటగాళ్లందరూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. అయితే ఆ తప్పులను సరిదిద్దుకొని బెంగళూరుతో మ్యాచ్​లోనైనా రాణిస్తారేమో చూడాలి.

జట్లు(అంచనా)

బెంగళూరు:విరాట్ కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, మ్యాక్స్​వెల్, డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, జేమిసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, పాటిదార్, చాహల్, సామ్స్​

పంజాబ్:కేఎల్రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హెన్రిక్స్, షారుక్ ఖాన్, క్రిస్ జోర్డాన్, మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

ఇదీ చూడండి..సీఎస్కే టీమ్​ మెంబర్​ అంత పనిచేశాడా?

ABOUT THE AUTHOR

...view details