ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ అప్రమత్తమైంది. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు ఇలానే కొనసాగితే ఏం చేయాలనేది ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ప్లాన్-బి కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జట్ల యాజమాన్యాలతో జరిగే సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇంతకీ ఏంటీ ప్లాన్-బీ?
గత రెండు ఐపీఎల్ సీజన్లు యూఏఈలోనే జరిగాయి(2021లో తొలి అర్ధభాగం మినహా). అది కూడా ఓ సీజన్ ప్రేక్షకుల్లేకుండా మరోసారి కొంతమంది సమక్షంలో మ్యాచ్లు నిర్వహించారు. దీంతో తర్వాతి సీజన్ ఎలా అయినా సరే స్వదేశంలో జరపాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోంది.