Pant Fined: దిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్ తగిలింది. కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. గురువారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ ఫైన్ విధించారు. ''నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 12 లక్షల ఫైన్ వేశాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల్లో దిల్లీ చేసిన మొదటి తప్పు ఇది.'' ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే వరుస ఓటములతో తల్లడిల్లుతున్న దిల్లీకి.. ఇది మరో దెబ్బ. గురువారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది పంత్ టీం. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. 3 వికెట్లే కోల్పోయినా.. ఎక్కువ స్కోరు చేయలేకపోయింది. పృథ్వీ షా(61) మినహా ఎవరూ రాణించలేదు. పంత్(39), సర్ఫ్రాజ్ ఖాన్(36) చాలా నెమ్మదిగా ఆడారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ.. సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ డికాక్(80) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. పాయింట్ల పట్టికలో లఖ్‌నవూ రెండో స్థానానికి చేరగా.. దిల్లీలో ఏడులో కొనసాగుతోంది. ఐపీఎల్లో భాగంగా.. శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ముంబయి బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.