Brian Lara on Rashid Khan: అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడెలా బౌలింగ్ చేస్తాడో.. ఎలా వికెట్లు తీస్తాడో అందరికీ తెలిసిందే. అయితే, అతడేమీ పెద్ద 'వికెట్ టేకర్' కాదని హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రయన్ లారా అన్నాడు. 2017 నుంచి గతేడాది వరకు హైదరాబాద్ తరఫునే ఆడిన రషీద్.. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం కోల్‌కతాతో ఆడిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. ఈ టోర్నీ చరిత్రలో వంద వికెట్లు తీసిన నాలుగో విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతడి బౌలింగ్‌పై స్పందించిన లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'రషీద్ ఖాన్ వికెట్ టేకర్ కాదు.. ఆ ఎకానమీ దండగే!' - లారా రషీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Brian Lara on Rashid Khan: లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్ పెద్ద వికెట్ టేకర్ కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ లారా చెప్పుకొచ్చాడు. రషీద్ ఎకానమీ మెరుగ్గా ఉన్నప్పటికీ.. దానివల్ల ఉపయోగం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Rashid Khan wicket taker: 'రషీద్‌ఖాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ, అతడు లేకున్నా మా జట్టు కాంబినేషన్ అద్భుతంగా ఉంది. అతడి బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనవసరంగా రిస్క్ తీసుకోకూడదని భావించి ఆడతారు. అంతే కానీ, అతనేదో పెద్ద వికెట్లు తీసే బౌలర్ కాదు. అతడి ఎకానమీ సుమారు ఆరు. అది మెరుగ్గా ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నర్‌కు తొలి ఆరు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇస్తే అతడు కూడా మంచిగా బౌలింగ్ చేస్తాడు. ఇప్పుడు వాషింగ్టన్ స్థానంలో సుచిత్ కూడా బాగా ఆడుతున్నాడు. ఇక ఇప్పటి వరకు మేం ప్రతి మ్యాచ్‌లోనూ నలుగురు ఫాస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగాం. అలాగే మా రిజర్వ్ బెంచ్ కూడా చాలా బలంగా ఉంది. అయితే, రషీద్ మా జట్టులో ఉంటే మరింత బాగుండేది. ఈ పాటికి మేం ఆడిన ఏడు మ్యాచ్‌లూ గెలిచేవాళ్లమేమో' అని లారా వివరించాడు.
ఇదీ చదవండి:ప్లేఆఫ్స్‌కు చేరేదెవరు? సీఎస్కేకు ఇంకా ఛాన్స్ ఉందా?