తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతా జట్టుపై సెహ్వాగ్, లారా విమర్శలు - lara kolkata knight riders

కోల్​కతాతో మ్యాచ్​లో గెలిచిన ముంబయిపై సెహ్వాగ్​ ప్రశంసలు కురిపించాడు. గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఓడిపోయిన మోర్గాన్ సేనపై లారా విమర్శలు చేశాడు.

brian lara, sehwag
బ్రియాన్ లారా, వీరేంద్ర సెహ్వాగ్

By

Published : Apr 14, 2021, 2:54 PM IST

కోల్​కతా-ముంబయి మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్​పై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. అద్భుత విజయం సాధించిన ముంబయిపై మాజీ ఓపెనర్​ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించగా.. గెలిచే మ్యాచ్​ను చేజేతులా కోల్పోయిన కోల్​కతాను మాజీ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా విమర్శించాడు.

"ముంబయితో మ్యాచ్​లో కోల్​కతా నిర్లక్ష్యాన్ని చూశారు. 30 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన స్థితిలో కేకేఆర్​ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అయినా మ్యాచ్​ను కోల్పోయింది. రోహిత్​ సేన గొప్పగా బౌలింగ్ చేసింది" అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఇదీ చదవండి:షారుక్​ క్షమాపణలు.. బదులిచ్చిన రస్సెల్​

"మ్యాచ్​ తమ నియంత్రణలో ఉన్నప్పటికీ కోల్​కతా ఓడిపోయింది. 36 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముంబయితో మ్యాచ్​లో మోర్గాన్ సేనను పూర్తి నిర్ణక్ష్యం ఆవహించింది. ప్రత్యర్థి జట్టు సరైన సమయంలో మంచి బౌలర్లను బరిలోకి దింపింది. వారు చివరి వరకు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. విజయానికి రోహిత్ సేన పూర్తిగా అర్హులు. చెపాక్​లో సగటు స్కోరు 145 పరుగులనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుండేది" అని లారా కోల్​కతా జట్టుపై విమర్శలు చేశాడు.

ఇదీ చదవండి:టోక్యో ఒలింపిక్స్ లోగో, మస్కట్​ ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details