తెలంగాణ

telangana

ETV Bharat / sports

CSK Dhoni retain: 'మహీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు' - csk dhoni

ipl 2021 retain player: టీమ్‌ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను రిటెయిన్‌ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. రాబోయే సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

సీఎస్కే రిటెన్షన్​, ఐపీఎల్​ రిటెన్షన్​, ధోనీ రిటెన్షన్​, dhoni retention
సీఎస్కే రిటెన్షన్​

By

Published : Dec 1, 2021, 10:03 AM IST

Updated : Dec 1, 2021, 11:47 AM IST

CSK retain dhoni: టీమ్‌ఇండియా మాజీ దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని మాజీ బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌-2022 సీజన్‌ మెగా వేలానికి సంబంధించి.. సీఎస్కే ఫ్రాంఛైజీ రిటెయిన్‌ చేసుకున్న(ipl 2021 retained players list csk) ఆటగాళ్ల వివరాలను వెల్లడించడానికి వచ్చిన బాలాజీ పలు విషయాలు వెల్లడించాడు.

"ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. చెన్నై జట్టుకి ఆడుతున్నంత కాలం అతడు కెప్టెన్‌గా కొనసాగుతాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ను రిటెయిన్‌ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతడి శక్తి సామర్థ్యాలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మా జట్టులో కీలక ఆటగాడు. టీమ్‌ఇండియా తరఫున, చెన్నై జట్టు తరఫున అతడు ఇప్పటికే చాలా సార్లు తన సామర్థ్యమేంటో నిరూపపించుకున్నాడు. అవసరమైన సమయంలో బంతితో పాటు, బ్యాటుతోనూ గొప్పగా రాణించగలడు. మొయీన్ అలీని రిటెయిన్‌ చేసుకోవడం వల్ల జట్టుకు సమతూకం వచ్చింది. అటు ఆఫ్‌ స్పిన్ బౌలర్‌గానూ, ఇటు ఎడమ చేతి వాటం బ్యాటర్‌గానూ అలీ పనికొస్తాడు. రాబోయే సీజన్‌ కోసం ఎదురు చూస్తున్నాం" అని బాలాజీ పేర్కొన్నాడు.

కాగా, సీఎస్కే యాజమాన్యం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాని మొదటి ప్రాధాన్య ఆటగాడిగా, ధోనిని రెండో ప్రాధాన్య ఆటగాడిగా ఎంచుకుంది. ఈ నిర్ణయంతో ధోని కంటే జడేజా రూ.4 కోట్లు ఎక్కువగా అందుకోనున్నాడు. జడేజాకు రూ.16 కోట్లు, ధోనికి రూ.12 కోట్లు దక్కనున్నాయి. మొయీన్‌, రుతురాజ్‌లకు వరుసగా రూ.8 కోట్లు, రూ.6 కోట్లు లభించనున్నాయి.

ఇదీ చూడండి: ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?

Last Updated : Dec 1, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details