ఈ నెల 18న జరిగే ఐపీఎల్ వేలం కోసం ప్రకటించిన తుది జాబితాలో ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. 8 ఫ్రాంచైజీల్లో ఏ ఒక్కటి అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు.
ఐపీఎల్ 2021 వేలం కోసం 1,114 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి 292 మందిని తుది జాబితాలో చోటు కల్పించారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లు కాగా.. 125 మంది విదేశీ క్రీడాకారులు. మరో ముగ్గురు అసోసియేటేడ్ నేషన్స్ ప్లేయర్స్.
అత్యధిక విలువ అయిన రూ.2 కోట్ల జాబితాలో హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, షకిబుల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియమ్ ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్ వుడ్లు ఉన్నారు.