తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా బాధితుల కోసం ఐపీఎల్ జీతమిచ్చేసిన క్రికెటర్ - పంజాబ్​ కింగ్స్​ వార్తలు

ఐపీఎల్​లో ఆడుతున్న విండీస్ క్రికెటర్ నికోలస్​ పూరన్​ మంచి మనసు చాటుకున్నాడు. ఈ లీగ్​లో ఆడగా వచ్చిన జీతంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితుల కోసం విరాళంగా అందించనున్నట్లు ప్రకటించాడు.

Nicholas Pooran to donate portion of IPL salary
ఐపీఎల్​ జీతంతో కరోనా బాధితులకు పూరన్​ సాయం

By

Published : Apr 30, 2021, 2:17 PM IST

దేశంలో కరోనా రెండోదశ వేగంగా వ్యాపిస్తున్న వేళ తన వంతు సాయాన్ని అందించేందుకు పంజాబ్​ కింగ్స్​ బ్యాట్స్​మన్​ నికోలస్​ పూరన్​ ముందుకొచ్చాడు. ఐపీఎల్​ ఆడే మ్యాచ్​లతో వచ్చిన జీతంలో కొంతభాగాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

"ప్రపంచంలో మిగతా దేశాలు కరోనా వైరస్​తో పోరాడుతున్నప్పటికీ.. భారతదేశంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో నా వంతుగా ఆర్థిక సహాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నా"

- నికోలస్​ పూరన్​, పంజాబ్​ కింగ్స్​ బ్యాట్స్​మన్​

ఇదే విధంగా కరోనా బాధితులకు ఆక్సిజన్​ సరఫరాకు అవసరమయ్యే నిధులను ఇస్తామని పంజాబ్​ కింగ్స్​ యాజమాన్యం ప్రకటించింది. "కరోనాకు వ్యతిరేకంగా దేశంలో జరుగుతోన్న పోరాటానికి మేము మద్దతిస్తున్నాం. ఈ సందర్భంగా మా వంతుగా సాధ్యమైనంత సాయాన్ని విరాళంగా ఇవ్వాలని అందర్నీ కోరుతున్నాం" అని పంజాబ్​ కింగ్స్​ ట్వీట్​ చేసింది.

ఇదీ చూడండి..ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నా: పంత్​

ABOUT THE AUTHOR

...view details