తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్పత్రి నుంచి మురళీధరన్ డిశ్చార్జ్​

గుండెపోటుకు గురైన దిగ్గజ క్రికెటర్​ ముత్తయ్య మురళీధరన్​కు యాంజియోప్లాస్టీ తర్వాత సోమవారం డిశ్చార్జ్​ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఎప్పటిలాగే తన పని చేసుకోవచ్చని వైద్యులు వెల్లడించారు.

Muttiah Muralitharan discharged
ముత్తయ్య మురళీధరన్ డిశ్చార్జ్​

By

Published : Apr 19, 2021, 5:52 PM IST

Updated : Apr 19, 2021, 6:46 PM IST

శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత సోమవారం డిశ్చార్జ్​ చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న ముత్తయ్యకు శనివారం గుండెపోటు రావడం వల్ల ఆసుపత్రిలో చేర్చారు. ఆపై ఆదివారం యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేసి స్టెంట్‌ అమర్చి సోమవారం డిశ్చార్జ్​ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. మురళీధరన్​ తిరిగి గతంలో మాదిరిగా పనిచేసుకోవచ్చని డాక్టర్లు స్పష్టం చేశారు.

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్.. ఆ జట్టు తరఫున 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో అత్యధికంగా 800 వికెట్లను పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 534, టీ20ల్లో 13 వికెట్లను సాధించాడు. ​1996 ప్రపంచకప్​ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టులో ముత్తయ్య మురళీధరన్​ భాగమయ్యాడు.

ఇదీ చూడండి:దిగ్గజ స్పిన్నర్​ ముత్తయ్య మురళీధరన్​కు స్టెంట్

Last Updated : Apr 19, 2021, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details