తెలంగాణ

telangana

ETV Bharat / sports

భార్యను భయపెట్టిన రోహిత్​.. ఆకట్టుకుంటున్న వీడియో! - ముంబయి ఇండియన్స్​ కెప్టెన్

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ (rohit sharma news) ఫ్రాంక్​స్టార్​గా మారాడు!. తాజాగా అతడు షేర్ చేసిన ఫ్రాంక్​ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియోలో రోహిత్​ తన భార్య రితికా సజ్దేపై (rohit sharma wife) ఫ్రాంక్ చేసిన దృశ్యాలున్నాయి. మీరూ చూసేయండి..

rohit sharma news
భార్యను భయపెట్టిన రోహిత్​

By

Published : Oct 5, 2021, 11:15 AM IST

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ బ్యాటింగ్ (rohit sharma news)​ అంటే క్రికెట్​ ఫ్యాన్స్​కు పండగే. రోహిత్ భారీ షాట్స్​ ఆడుతుంటే చూడటం కోసం ఎన్ని పనులనైనా పక్కనపెట్టేస్తారు. ముంబయి ఇండియన్స్​ను (rohit sharma mumbai indians) ఐదుసార్లు ఛాంపియన్​గా నిలిపి ఐపీఎల్​లో సారథిగా తనదైన ముద్ర వేశాడు రోహిత్​. మైదానంలో ప్రేక్షకులను మైమరిపించడమే కాదు సోషల్​ మీడియాలోనూ అభిమానులను తరచుగా (rohit sharma latest news) అలరిస్తుంటాడు హిట్​మ్యాన్. తాజాగా రోహిత్​ షేర్​ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఈ వీడియోలో రోహిత్​ తన భార్య రితికా సజ్దేపై (rohit sharma wife) ఫ్రాంక్ చేసిన దృశ్యాలున్నాయి. తన పిడికిలిలో చాక్లెట్​ను పట్టుకుని ఓపెన్​ చేయమని ఆమెకు చెబుతాడు. పిడికిలిలో ఏముందో తెలియని రితిక భయానికి లోనవుతుంది. రోహిత్ పిడికిలి ముట్టుకోవడానికి కూడా భయపడి పరుగులు పెడుతుంది. చివరికి రోహిత్ తనకు తానే పిడికిలిని ఓపెన్ చేయగా.. అందులో చాక్లెట్ దర్శనమిస్తుంది. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంటుంది.

గతేడాది యూఏఈలో జరిగిన సీజన్​లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్​.. ఈ ఏడాది పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు లీగ్​లో 12 మ్యాచ్​లు ఆడిన రోహిత్​ సేన కేవలం 5 మ్యాచ్​ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఇక ప్లేఆఫ్స్​కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్​ల్లో మంచి రన్​రేట్​తో నెగ్గాల్సి ఉంది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్​తో జరగబోయే మ్యాచ్​తో పాటు మరో పోరులోనూ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఎలిమినేషన్​కు దగ్గర్లో ఉన్నప్పటికీ రోహిత్​ తన ఫ్యాన్స్​ను నిరంతరం అలరిస్తునే ఉన్నాడు.

ఇదీ చదవండి:MI Vs RR Preview: ముంబయి-రాజస్థాన్.. కీలకపోరులో గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details