యువ ఆల్‌రౌండర్ అర్జున్ తెందూల్కర్ రాణించడానికి ముంబయి ఇండియన్స్ టీమ్ వాతావరణం సహకరిస్తుందని ఆ జట్టు డైరెక్టర్ జహీర్ ఖాన్ వెల్లడించాడు. కానీ, ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి ప్రస్తుత ఐపీఎల్లో తనకు తానుగా శ్రమించాలని తెలిపాడు.
"అర్జున్‌కు కొన్ని మెళకువలు నేర్పేందుకు నెట్స్‌లో అతడితో ఎక్కువ సమయాన్ని కేటాయించాను. అతడిది కష్టపడే వ్యక్తిత్వం. ఇందులో చెప్పుకోదగిన విషయం ఏంటంటే.. నేర్చుకోవడానికి అతడు ఎంతో ఆసక్తి చూపుతాడు. సచిన్ తెందూల్కర్ కుమారుడు అవ్వడం వల్ల అతడికి మరికొంత ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు రాణించడానికి ముంబయి ఇండియన్స్ జట్టు వాతావరణం సహకరిస్తుంది. ఓ మంచి క్రికెటర్‌గా ఎదిగేందుకు అది తోడ్పడుతుంది".
- జహీర్ ఖాన్, ముంబయి ఇండియన్స్ డైరెక్టర్