తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పట్లో జడేజా ఫీల్డింగ్​పై​ ధోనీ ట్వీట్.. ఇప్పుడు వైరల్ - రవీంద్ర జడేజా ఫీల్డింగ్ ధోనీ ట్వీట్

రాజస్థాన్ రాయల్స్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో సీఎస్కే ఆల్​రౌండర్ జడేజా తన ఫీల్డింగ్​తో అద్భుతం చేశాడు. దీంతో అతడి ఫీల్డింగ్​పై ఎనిమిదేళ్ల క్రితం ధోనీ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

Jadeja, Dhoni
జడేజా, ధోనీ

By

Published : Apr 20, 2021, 3:39 PM IST

రవీంద్ర జడేజా.. మెరుపు ఫీల్డింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌. పాదరసంలా కదులుతూ బంతిని ఒడిసిపట్టడంలో ఈ టీమ్ఇండియా ఆల్‌రౌండర్‌ దిట్ట. ఎన్నోసార్లు అద్భుతమైన క్యాచులు అందుకుని భారత జట్టుకు ఎన్నో విజయాలనందించాడు. ఐపీఎల్‌లో ధోనీ సారథిగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

సోమవారం సీఎస్కే.. వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడి 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జడేజా (7) బ్యాట్‌తో నిరాశపర్చినా.. రెండు వికెట్లు తీశాడు. ధాటిగా ఆడుతున్న జాస్‌ బట్లర్‌(49)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అలాగే మనన్ వోహ్రా, రియాన్‌ పరాగ్, క్రిస్‌ మోరిస్‌, ఉనద్కత్‌ల క్యాచులను అందుకుని చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే.. జడేజా ఫీల్డింగ్ గురించి ఎనిమిదేళ్ల క్రితం(ఏప్రిల్‌ 9, 2013) ధోనీ చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..‘ "సర్ జడేజా క్యాచ్‌ కోసం పరుగెత్తడు. జడేజా ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని బంతే అతని చేతిలోకి వస్తుంది" అని ఉంది. దీనిపై నెటిజన్లు, ధోనీ అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్​తో సందడి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details