ఐపీఎల్ అంటే సిక్సులు, ఫోర్లు.. అభిమానుల కేరింతలే గుర్తొస్తాయి. అలాంటిది గతేడాది కరోనా వల్ల అభిమానుల్లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి. అయినా సరే కావాల్సినంత వినోదాన్ని పంచింది ఆ సీజన్. అందులో ధోనీ, స్టేడియం బయటకు కొట్టిన ఓ సిక్స్ అయితే ఇప్పటికీ అభిమానులకు గుర్తుంది. ఇప్పుడు ఆ సిక్స్‌కు గూగుల్ గుర్తింపు లభించడం మహీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా చేస్తోంది.
షార్జా స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ అది. చివర్లో ధోనీ వరుస సిక్సర్లు కొట్టాడు. అందులో ఓ సిక్స్ స్టేడియం బయట రోడ్డుపై పడింది. ఆ బంతిని ఓ అభిమాని తీసుకుని వెళ్లిపోవడం కెమెరాల్లో రికార్డు కూడా అయింది. అయితే ఆ బంతి పడిన చోటును గూగుల్ మ్యాప్‌లో 'ధోనీస్ సిక్స్'గా పలువురు నెటిజన్లు పేరు పెట్టారు. దానిని గూగుల్ నుంచి ధ్రువీకరణ వచ్చింది. కావాలంటే ఈ దిగువన ఉన్న ఫొటో చూసేయండి.