ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ కెప్టెన్సీలో అనుభవజ్ఞులతో కూడిన చెన్నైని ఢీకొట్టేందుకు సిద్ధమైంది పంత్ సారథ్యంలోని దిల్లీ. ఈ రెండు జట్ల మ్యాచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరుజట్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఆటగాళ్లు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు పీల్డింగ్‌లో కసరత్తులు చేస్తున్నారు.
దిల్లీతో మ్యాచ్‌కు ముందు ధోనీ ధనాధన్! - చెన్నై సూపర్ కింగ్స్-దిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలోనే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో బిజీ అయ్యాయి. చెన్నై సారథి ధోనీ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఫ్రాంచైజీ.
ధోనీ
ఈ క్రమంలోనే నెట్స్‌లో ధోనీ ధనాధన్ సిక్సులు బాదుతూ కనిపించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఫ్రాంచైజీ. దిల్లీతో మ్యాచ్‌కు ముందు మహీ ఇలా సిక్సులు కొడుతుంటే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్‌ను మ్యాచ్‌లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నారు.