ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్(CSK vs KKR 2021). ఈ గెలుపుతో సీఎస్కే ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ధోనీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సీఎస్కే బ్యాట్స్‌మన్ సురేష్ రైనా సతీమణి ప్రియాంక. మహీ(Dhoni Sakshi News) తండ్రి కాబోతున్నాడని చెప్పింది.
ధోనీ భార్య సాక్షి(Dhoni Sakshi News) ప్రస్తుతం నాలుగు నెలల గర్భంతో ఉందని ప్రియాంక వెల్లడించింది. దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా మహీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. బుల్లి ధోనీ జన్మిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ధోనీ-సాక్షి జంటకు 2010లో వివాహం జరగగా.. 2015లో వీరికి జీవా సింగ్ జన్మించింది. జీవా అంటే మహీకి విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తనతో ఎంతో సరదాగా గడుపుతుంటాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సాక్షి సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
భారీ లక్ష్యం..