ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రాజస్థాన్ రాయల్స్-ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇప్పటికే ఐదేసి మ్యాచ్‌లాడిన ఇరు జట్లు.. చెరో రెండు విజయాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన.. మునుపటి ప్రదర్శనను చూపలేకపోతోంది. నలుగురు విదేశీ ఆటగాళ్లు దూరమైన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని భావిస్తోంది.
తుదిజట్లు: