MI vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గత మూడు మ్యాచ్‌లలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న జడేజా జట్టు ముంబయిపై గెలుపొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో ముంబయి జట్టును 155 పరుగులకు కట్టడి చేసింది. ఛేదనలో అంబటి రాయుడు 40(35), రాబిన్ ఊతప్ప 30(25) కీలక పాత్ర పోషించారు. ఎంఎస్ ధోనీ (13 బంతుల్లో 28* పరుగులు: ఒక సిక్స్, 3 ఫోర్లు) మరోసారి 'ఫినిషర్' అవతారమెత్తాడు. చివరి ఓవర్‌లో 17 పరుగులు కొట్టాల్సిన తరుణంలో ధోనీ ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది చెన్నైకి విజయాన్ని చేకూర్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌తోనైనా టీ20 లీగ్‌లో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి మళ్లీ అడియాశే మిగిలింది.
MI vs CSK: లాస్ట్ ఓవర్లో చెలరేగిన ధోనీ.. ముంబయికి వరుసగా ఏడో ఓటమి
MI vs CSK: ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తన రెండో విజయాన్ని నమోదు చేసింది చెన్నై జట్టు. మరోవైపు తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న ముంబయి జట్టుకు నిరాశే మిగిలింది.
అంతకుముందు.. ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ (51*) అర్ధశతకం సాధించడంతో చెన్నైకి ముంబయి ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించగలిగింది. దీంతో చెన్నై ఎదుట 156 పరుగులను లక్ష్యంగా ఉంచింది. తిలక్ వర్మ కాకుండా సూర్యకుమార్ యాదవ్ (32), హృతిక్ షోకీన్ (25) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్ (0), ఇషాన్ కిషన్ (0) డకౌట్ కాగా.. బ్రెవిస్ (4), కీరన్ పొలార్డ్ (12), డానియల్ సామ్స్ (5*) విఫలమయ్యారు. ఆఖర్లో జయ్‌దేవ్ ఉనద్కత్ (19*: ఒక సిక్స్, ఒక ఫోర్)తో తిలక్ వర్మ 16 బంతుల్లో 35 పరుగులు జోడించాడు. చెన్నై ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను డ్రాప్ చేశారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3, డ్వేన్ బ్రావో 2.. మిచెల్ సాంట్నర్, తీక్షణ చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి :రోహిత్, బుమ్రాలకు అరుదైన గౌరవం.. ఆ జాబితాలో చోటు