తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధావన్​, పృథ్వీ విధ్వంసక బ్యాటింగ్ రహస్యాలివే.. - శిఖర్ ధావన్

ఇటీవల అత్యుత్తమ బ్యాటింగ్​తో దిల్లీకి ఓపెనింగ్​లో శుభారంభాలు అందిస్తున్న ధావన్-పృథ్వీ జోడీ.. వారి బ్యాటింగ్​ వెనుక ఉన్న కారణాలను తాజాగా వెల్లడించారు. స్ట్రైక్ రేట్​పై దృష్టి సారించినట్లు 'గబ్బర్​' తెలపగా.. బ్యాటింగ్​లో స్వల్ప టెక్నిక్ మార్పులతో రాణిస్తున్నట్లు షా పేర్కొన్నాడు.

shikhar dhawan, prithvi shaw
శిఖర్ ధావన్, పృథ్వీ షా

By

Published : Apr 19, 2021, 11:35 AM IST

పంజాబ్​తో మ్యాచ్​లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది దిల్లీ క్యాపిటల్స్​. అయితే ఈ విజయంలో ఓపెనర్లు ధావన్​-పృథ్వీ జోడీ మరోసారి కీలక పాత్ర పోషించారు. 'గబ్బర్'​ కొద్దిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. యువ బ్యాట్స్​మన్​ షా ఉన్న కాసేపట్లో ప్రత్యర్థికి చేయాల్సిన నష్టం చేసే వెళ్లాడు. అయితే వీరి ఆటతీరు వెనుక ఉన్న కారణాలను తాజాగా పంచుకున్నారు.

స్ట్రైక్ రేట్​పై దృష్టి సారించా..

ఇటీవల మ్యాచ్​ల్లో తన స్ట్రైక్​ రేట్​ మెరుగుపడటం గురించి స్పందించాడు శిఖర్​ ధావన్​. అందుకోసం కాస్త రిస్క్ తీసుకున్నట్లు వెల్లడించాడు. "స్ట్రైక్​ రేట్​ పెంచుకోవాలని అనుకున్నాను. మార్పులకు భయపడను. సవాళ్లను ఎల్లప్పుడూ స్వీకరిస్తాను. కొన్ని షాట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాను. దీంతో నా స్లాగ్​ షాట్​ మెరుగైంది. ఇప్పుడు మరింత స్వేచ్ఛగా బ్యాట్​ ఝుళిపిస్తున్నాను. చాలా ఏళ్ల నుంచి ఆడుతున్నాను కాబట్టి రిలాక్స్డ్​గా బ్యాటింగ్ చేస్తున్నాను" అని ధావన్​ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి:టీ20 వరల్డ్​కప్​లో డివిలియర్స్​ రీ-ఎంట్రీ!

టెక్నిక్​లో స్వల్ప మార్పులు..

గత ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమై విమర్శల పాలైన పృథ్వీ.. తన టెక్నిక్​లో స్వల్ప మార్పులు చేసుకున్నట్లు తెలిపాడు. అనంతరం విజయ్​ హజారే టోర్నీలో సత్తా చాటిన ఈ యువ బ్యాట్స్​మన్​.. ఏకంగా 827 పరుగులు సాధించాడు. ఐపీఎల్​లో చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్​లో 38 బంతుల్లోనే 72 పరుగులు చేసిన పృథ్వీ.. తన ఫామ్​ను చాటుకున్నాడు.

"ఆసీస్​ పర్యటనలో నేను బౌల్డ్ ఔట్​​గా వెనదిరిగడం వల్ల నాలో ఆందోళన మొదలైంది. ఆసీస్ నుంచి రాగానే ఈ విషయంపై దృష్టి సారించాను. మా కోచ్​ ప్రశాంత్​ శెట్టి, ప్రవీణ్​ ఆమ్రేతో కలిసి ఈ విషయంపై చర్చించాను. విజయ్ హజారే ట్రోఫీలో నా సహజమైన ఆట ఆడాను. ఇందులో కేవలం చిన్న టెక్నిక్ మార్పు చేసుకున్నాను. అప్పటినుంచి నా బ్యాటింగ్ మెరుగుపడింది" అని పృథ్వీ తెలిపాడు.

ఐపీఎల్​కు ముందు కావాల్సినంత ప్రాక్టీస్ మ్యాచ్​లు లేనప్పటికీ.. పాంటింగ్, ఆమ్రే, ప్రశాంత్​లతో మంచి ప్రాక్టీస్​ సెషన్లు లభించాయని పృథ్వీ తెలిపాడు. "క్రీజులో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమని పాంటింగ్ చెప్పాడు. మొదటి 6 ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పడం అవసరమని పేర్కొన్నాడు. బ్యాటింగ్​కు వెళ్లే ముందు శిఖర్​తో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాను" అని షా పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:ఫ్రెంచ్​ ఓపెన్​లో బరిలోకి దిగుతా: ఫెదరర్

ABOUT THE AUTHOR

...view details