ఐపీఎల్ ఆటగాళ్లందరికీ వచ్చే వారం వాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ అన్నాడు. మంగళవారం ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే ఈ ప్రకటనను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కాకుండా ముంబయి ఇండియన్స్‌కు చెందిన బ్యాట్స్‌మన్ వెల్లడించడం అందర్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది.
"దేశంలో సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని మాకు తెలుసు. మాకంటే దారుణమైన పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కానీ, మా ఆటగాళ్లంతా బయోబబుల్‌లో ఉన్నాం. వచ్చే వారం వాక్సిన్లు వేయించుకోనున్నాం. ఓ ప్రైవేట్ విమానంలో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నా. రిస్క్ అని తెలిసే టోర్నీ ఆడేందుకు సంతకాలు చేశాం. ఐపీఎల్ ముగిసిన తర్వాత వీలైనంత త్వరగా ఇంటికి వెళ్తే బాగుంటుంది".
- క్రిస్ లిన్, ఆస్ట్రేలియా క్రికెటర్