ఐపీఎల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 92 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా 10 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించింది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు డగౌట్లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
మసాజ్ థెరపిస్టుతో ఆర్సీబీ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్! - RCB Vs KKR 2021
అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డగౌట్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బ్యాటింగ్‌కు సిద్ధమైన ఆర్సీబీ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్.. ఆ జట్టుకు చెందిన మసాజ్ థెరపిస్టు మధ్య జరిగిన 'రొమాంటిక్ ఐ కంటాక్ట్' సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్సీబీ స్కోర్ 53/4 ఉండగా ఆర్సీబీ బ్యాట్స్‌మన్ జేమీసన్ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో ఆర్సీబీకి చెందిన మసాజ్ థెరపిస్ట్ నవనీతా గౌతమ్.. జేమీసన్ మధ్య నవ్వులు చిగురించాయి. ఈ సన్నివేశమంతా కెమెరా కంట పడింది. దీంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 'మెన్ విల్ బి మెన్', 'మ్యాచ్ పోతే పోయింది అమ్మాయి దొరికింది'.. అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి..KKR vs RCB: బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన ఆర్సీబీ.. కారణమదే!