KL Rahul Injury : టీమ్ఇండియాను గాయల బెడద వెంటాడుతునే ఉంది. ఇప్పటికే బుమ్రా, శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరమవగా.. తాజాగా కేఎల్ రాహుల్ ఈ జాబితాలో చేరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా ఇటీవలె లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితోనే మ్యాచ్ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోగా.. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్నకూ దూరం అవుతున్నట్లు తెలిపాడు. కాగా తన వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు రాహుల్ త్వరలోనే తొడకు సర్జరీ చేయించుకోనున్నాడు.
"బిసిసిఐ వైద్య బృందం సహాయంతో నేను నా తొడ గాయానికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాను. కొన్ని వారాల్లో తిరిగి మైదానంలోకి రావడానికి ప్రయత్నిస్తా. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ ఇది సరైనదని నేను భావిస్తున్నాను. ఈ నిర్ణయం బాధిస్తుంది. లక్నో జట్టుకు కెప్టెన్‌గా మరింత బాధగా ఉంది. కీలకమైన సమయంలో జట్టును విడిచిపెట్టాల్సి వచ్చింది. అయితే, నా సహచరులు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటారని భావిస్తున్నాను. బయటి నుంచి వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను. ప్రతి మ్యాచ్‌ని చూస్తాను.