తెలంగాణ

telangana

By

Published : Apr 29, 2021, 7:36 AM IST

ETV Bharat / sports

దిల్లీ బ్యాట్స్​మెన్​.. కోల్​కతా బౌలర్ల మధ్యే పోరు!

అహ్మదాబాద్​ వేదికగా ఐపీఎల్​లో గురువారం జరగనున్న రెండో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ తలపడనున్నాయి. ఇందులో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగవ్వాలని ఇరుజట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. రాత్రి 7. 30 గంటలకు ఈ మ్యాచ్​ ప్రారంభం కానుంది.

KKR's floundering batting faces strong DC test
దిల్లీ క్యాపిటల్స్​ వర్సెస్​ కోల్​కతా నైట్​రైడర్స్​

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో గురువారం జరగనున్న రెండో మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​తో కోల్​కతా నైట్​రైడర్స్​ తలపడనుంది. ఈ ఐపీఎల్​లో తామాడిన 6 మ్యాచ్​ల్లో.. దిల్లీ 4, కోల్​కతా 2 విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో దిల్లీ మూడు, కోల్​కతా ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.

తప్పిదం తెలుసుకొని..

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ రాణించిన దిల్లీ.. చివరికి ఒక్క పరుగు వ్యత్యాసంతో పరాజయం పొందడం ఆటగాళ్లను కలవరానికి గురిచేసింది. అయితే ఈ మ్యాచ్​ చివరి ఓవర్​లో మార్కస్​ స్టోయినిస్​ ఎక్కువ పరుగులు ఇవ్వడం సహా ఓపెనర్లు విఫలం కావడం వల్లే ఓటమికి కారణాలుగా తెలుస్తున్నాయి.

బ్యాటింగ్​లో పృథ్వీ షా, ధావన్​, స్మిత్​, పంత్​, హెట్​మయర్​, స్టోయినిస్​లతో దుర్భేద్యంగా ఉంది దిల్లీ. బౌలింగ్​లోనూ అవేశ్​ ఖాన్​, మిశ్రా అదరగొడుతున్నారు. రబాడా, అక్షర్​ నిరూపించుకోవాల్సి ఉంది.

పుంజుకున్నారా?

పంజాబ్​ కింగ్స్​తో​ ఆడిన చివరి మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో కోల్​కతా బౌలర్ల కృషి కనిపిస్తోంది. అయితే టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ మాత్రం తడబడుతున్నారు. నితీశ్​ రాణా, శుభ్​మన్ గిల్​, సునీల్​ నరైన్​​ నిలకడైన ప్రదర్శన చేయలేకపోతున్నారు.

దినేశ్ కార్తిక్​, కెప్టెన్​ ఇయాన్ మోర్గాన్​ ఫర్వాలేదనిపిస్తున్నారు. గత మ్యాచ్​లో రాణించారు. రసెల్​ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.

తుదిజట్లు(అంచనా):

కోల్​కతా నైట్ రైడర్స్​:ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీశ్ రాణా, శుభ్​మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, దినేశ్​ కార్తిక్ (వికెట్​ కీపర్​), ఆండ్రూ రస్సెల్, ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.​

దిల్లీ క్యాపిటల్స్​ :పృథ్వీ షా, శిఖర్​ ధావన్, స్టీవ్ స్మిత్, రిషభ్​​ పంత్ (కెప్టెన్, వికెట్​కీపర్​), మార్కస్​ స్టోయినిస్, హెట్​మెయర్, అక్షర్​ పటేల్, ఇషాంత్ శర్మ, రబాడ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్.

ఇదీ చూడండి..ఐపీఎల్​పై మోర్గాన్​ అలా.. జంపా ఇలా!

ABOUT THE AUTHOR

...view details