రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
అదరగొట్టిన కోల్‌కతా.. రాజస్థాన్ లక్ష్యం 172 - క్రికెట్ లైవ్
షార్జాలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఆకట్టుకునే బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కోల్‌కతాకు ఫ్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి.
శుభ్‌మన్ గిల్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టుకు బలమైన ఓపెనింగ్ లభించింది. తొలి వికెట్‌కు వెంకటేశ్-శుభ్‌మన్ 79 పరుగులు జోడించారు. అనంతరం 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెంకటేశ్ అయ్యర్ ఔటయ్యాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ త్రిపాఠి 21, నితీశ్ రానా 12, దినేశ్ కార్తిక్ 14, మోర్గాన్ 13 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్, తెవాటియా, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.