తెలంగాణ

telangana

ETV Bharat / sports

Nitish Rana Fine : కేకేఆర్ టీమ్​కు షాక్​.. కెప్టెన్ నితిశ్ రాణాకు ఫైన్​​!

KKR Captain Nitish Rana : మ్యాచ్​ గెలిచామని సంబరాలు చేసుకుంటున్న సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది. పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్​ ప్రదర్శించినందుకు అతనిపై జరిమానా విధించింది.

KKR Skipper Nitish Rana
Nitish Rana

By

Published : May 9, 2023, 11:21 AM IST

Nitish Rana KKR : కోల్​కతా నైట్​ రైడర్స్​ కెప్టెన్​ నితీశ్​ రాణాకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. ఐపీఎల్​ సీజన్​ 16లో భాగంగా సోమవారం ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ టీమ్ స్లో ఓవర్ రేట్ చూపించింది. దీంతో కేకేఆర్​ టీమ్​పై బీసీసీఐ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్​కు నితీశ్‌కు జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్.. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందని దీని కారణంగా..జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు రూ. 12లక్షల జరిమానా విధించినట్లు పేర్కొంది.

కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో నితీశ్ రాణా జరిమానాను ఎదుర్కోవడం ఇది రెండోసారి. గత నెల 16న ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ నితీశ్ రాణాకు బీసీసీఐ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో రాణా ఔట్ అయిన తరువాత ముంబయి ఇండియన్స్ బౌలర్ హృతిక్‌తో వాగ్వావాదానికి దిగాడు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ.. రాణా మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

KKR Captain Nitish Rana : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో చాలా కీలకంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను కేకేఆర్ జట్టు అనూహ్యంగా ఓడించింది. ఒక్క లాస్ట్​ బాల్​కు లక్ష్యాన్ని తమ ఖాతాలోకి వేసుకుంది. దీంతో కేకేఆర్​.. పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. టాస్ గెలిచిన పంజాబ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారీ స్కోర్లు నమోదు చేయాల్సిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు అనుకున్నంత స్కోర్​ సాధించలేకపోయింది. మరోవైపు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్, భానుక రాజపక్స స్కోర్​ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు.

KKR VS PBKS : అయితే మిగతా బ్యాటర్లతో కలిసి కెప్టెన్ శిఖర్ ధవన్ చివరి వరకు పోరాడాడు. కానీ వారికి ఆశించిన ఫలితం దక్కలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అయితే ఈ టార్గెట్‌ను ఛేదించే విషయంలో కేకేఆర్‌కు శుభారంభమేమి దక్కలేదు. తొలుత రహ్మనుల్లా గుర్బాజ్ విఫలమయ్యాడు. అయితే జేసన్ రాయ్​తో కలిసి బరిలోకి దిగిన నితీష్ రాణా మైదానంలో చెలరేగిపోయాడు. ఆ తర్వాత దిగిన ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అలా చివరి బంతికి బౌండరీ బాదిన రింకూ సింగ్.. మరోసారి కేకేఆర్‌ను విజయ పథంలో నడిపించాడు

ABOUT THE AUTHOR

...view details