కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోని ఇద్దరు క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గురువారం ఉదయం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌కు వైరస్ సోకినట్లు తేలగా, ఇప్పుడు భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా కొవిడ్ బారిన పడినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికే ఈ జట్టులోని వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్.. కరోనా సోకడం వల్ల చికిత్స తీసుకుంటున్నారు.
టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్ - Prasidh Krishna tests corona
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జట్టుకు ఎంపికైన భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
![టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్‌కు కరోనా పాజిటివ్ India pacer Prasidh Krishna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11685264-577-11685264-1620465108347.jpg)
పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పాజిటివ్
ప్రసిద్ధ్ కృష్ణ.. త్వరలో జరగబోయే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం టీమ్ఇండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.
ఇదీ చూడండి: కోల్‌కతా ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌కు కరోనా