తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హిట్​మ్యాన్​తో కలిసి ఓపెనింగ్​ చేయాలని ఉంది' - రోహిత్​ శర్మ

Jos Buttler Rohith Sharma: ముంబయి జట్టు సారథి​ రోహిత్​ శర్మతో కలిసి ఓపెనర్​గా బరిలో దిగాలని ఉందని తన మనసులోని మాటను చెప్పాడు రాజస్థాన్​ ఓపెనర్ జాస్ బట్లర్. అలాగే పవర్‌ప్లేలో రషీద్​ ఖాన్​ బౌలింగ్‌లో తాను ఇబ్బంది పడతాడని పేర్కొన్నాడు.

jos-buttler-wants-rohit-sharma-as-his-opening-partner
jos-buttler-wants-rohit-sharma-as-his-opening-partner

By

Published : Apr 24, 2022, 6:17 AM IST

Updated : Apr 24, 2022, 6:34 AM IST

Jos Buttler Rohith Sharma: రాజస్థాన్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ ప్రస్తుతం జోరు మీదున్నాడు. భారత్‌లో జరుగుతోన్న ఐపీఎల్​ 15వ సీజన్‌ టీ20 లీగ్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ప్రతి జట్టుపైనా విరుచుకుపడుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు శతకాలు, రెండు అర్థ శతకాలతో మొత్తం 491 పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే ఏప్రిల్​ 22న దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో మరోసారి విధ్వంసం సృష్టించిన అతడు.. ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలు బయటపెట్టాడు. "ఓపెనింగ్‌ భాగస్వామిగా ఎవరితో ఆడాలనుకుంటున్నారు" అని అడగ్గా.. ప్రస్తుత తరంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో ఓపెనింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అలాగే పాత తరం క్రికెటర్లలో విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ పేరును తెలిపాడు. మాజీ దిగ్గజం టీ20 క్రికెట్‌ ఆడితే చూడాలని ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక 2018లో ముంబయితో ఆడిన ఇన్నింగ్స్‌.. ఈ టీ20 లీగ్‌లో తన ఫేవరెట్‌ అని చెప్పాడు. అలాగే పవర్‌ప్లేలో రషీద్​ ఖాన్​ బౌలింగ్‌లో ఇబ్బంది పడతాడని పేర్కొన్నాడు.

Last Updated : Apr 24, 2022, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details