తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మార్క్ అందుకున్న నాలుగో క్రికెటర్​ బెయిర్​ స్టో

దిల్లీతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్ జానీ బెయిర్​ స్టో ఓ మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్​లో వేగంగా 1000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్​గా నిలిచాడు.

Jonny Bairstow
బెయిర్​ స్టో

By

Published : Apr 26, 2021, 2:02 PM IST

ఆదివారం దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​తో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్​ జానీ బెయిర్​ స్టో ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్​లో వేగంగా 1000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్​గా నిలిచాడు. 26 ఇన్నింగ్స్​లో ఈ మార్క్​ను అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో బెయిర్​ స్టో(38: 18 బంతుల్లో 6 x4, 4 x3) ధనాధన్​ ఇన్నింగ్స్ ఆడాడు.

షాన్​ మార్ష్​(ఆస్ట్రేలియా, 21 ఇన్నింగ్స్​), లెండ్​ సైమన్స్​(వెస్ట్​ఇండీస్​, 23 ఇన్నింగ్స్​), మాథ్యూ హెడెన్​(ఆస్ట్రేలియా మాజీ, 24 ఇన్నింగ్స్​) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

బెయిర్​ స్టోను ఎందుకు తీసుకోలేదు?

చెపాక్ వేదికగా జరిగిన దిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ సూపర్ ఓవర్​కు దారి తీసింది. ఈ ఓవర్​లో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 7 పరుగులే చేయగా, అనంతరం దిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే హైదరాబాద్​ తరఫున వార్నర్​, విలియమ్స్​న్​ సూపర్​ ఓవర్​ బ్యాటింగ్ దిగారు. దీనిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.. బెయిర్​ స్టోను ఎందుకు ఫస్ట్ ఛాయిస్​గా తీసుకోలేదని ప్రశ్నించాడు. వింత నిర్ణయాలను తీసుకున్నందుకు తమకు తామే నిందించుకోవాలని అన్నాడు. సన్​రైజర్స్​ జట్టు బాగా ఆడిందని ప్రశంసించాడు.

ABOUT THE AUTHOR

...view details