ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2022)లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో(IPL 2022 Auction) రూట్ పాల్గొననున్నాడని సమాచారం. 2018 ఐపీఎల్ వేలంలో ఏ జట్టు రూట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే వచ్చేఏడాది ఐపీఎల్లో రెండు టీమ్స్ కొత్తగా చేరనున్న నేపథ్యంలో రూట్ వేలంలో అమ్ముడయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనడం సహా.. టీ20 ఫార్మాట్లో రాణించాలనే థ్యేయంతో రూట్(Joe Root IPL) ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 15వ సీజన్ కోసం జరగనున్న మెగావేలంలో కొత్తగా రెండు జట్లు చేరనున్నాయి. దీని ద్వారా మరో 16 మంది విదేశీ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఆడేందుకు అవకాశం లభించనుంది.