తెలంగాణ

telangana

ETV Bharat / sports

WARNER: 'భారత్​లో ఆ దృశ్యాలు చూసి కలత చెందా' - ఐపీఎల్ న్యూస్

భారత్​లో ఆక్సిజన్​ లేక పలువురు ప్రజలు ప్రాణాలు వదిలేయడం, శ్మశానాల్లో జనాలు ఎక్కువగా ఉండటం లాంటి దృశ్యాలు చూసి తమ మనసు కలత చెందిందని వార్నర్ అన్నాడు. ఐపీఎల్ వాయిదా వేసి, బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని చెప్పాడు.

It was terrifying, upsetting: Warner on stay in India during IPL
వార్నర్

By

Published : Jun 2, 2021, 3:05 PM IST

ఐపీఎల్ జరుగుతున్న సమయంలో భారత్​లోని కనిపించిన దృశ్యాలు కలచివేశాయని సన్​రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఆక్సిజన్​ లేక ప్రజలు ఇబ్బందిపడటం, శ్మశానాల్లో తమ కుటుంబసభ్యుల అంతిమ సంస్కారాలు చేసేందుకు జనాలు క్యూ కట్టడం లాంటి సంఘటనలు తనను బాధించాయని అన్నాడు.

కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నప్పటికీ ఐపీఎల్ మ్యాచ్​లు జరిగాయి. బయోబబుల్​లో ఉన్న పలువురు ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలడం వల్లే బీసీసీఐ, ఈ సీజన్​ను నిరవధిక వాయిదా వేసింది. ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచ్​ల్ని నిర్వహించనున్నారు.

డేవిడ్ వార్నర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details