పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అపెండిసైటిస్ ఆపరేషన్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక నికోలస్ పూరన్ స్థానంలో డేవిడ్ మలన్ అరంగేట్రం చేయనున్నాడు.
ఇరుజట్లు ఇప్పటికే ఏడేసి మ్యాచ్‌లాడగా.. దిల్లీ జట్టు ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మూడు విజయాలు సాధించిన పంజాబ్ ఐదో స్థానంలో నిలిచింది.