రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికే దూరమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై ఇంగ్లాండ్ బోర్డు, రాజస్థాన్ ఫ్రాంచైజీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్‌కు షాక్.. సీజన్ మొత్తానికి అతడు దూరం! - cricket news
తీవ్ర గాయమైన కారణంగా ఈ సీజన్ మొత్తానికి స్టార్ క్రికెటర్ స్టోక్స్ దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు త్వరలో ఇంగ్లాండ్ పయనం కానున్నాడు.
![రాజస్థాన్‌కు షాక్.. సీజన్ మొత్తానికి అతడు దూరం! Ben Stokes ruled out of IPL with suspected broken hand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11393352-984-11393352-1618333396507.jpg)
రాజస్థాన్‌కు షాక్.. సీజన్ మొత్తానికి అతడు దూరం!
పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో గేల్ క్యాచ్ పట్టిన సమయంలో స్టోక్స్ చూపుడు వేలులోని ఎముక పక్కకు జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత టెస్టు చేయగా, గాయం తీవ్రమైనదిగా తేలిందట. దీంతో త్వరలో అతడు ఇంగ్లాండ్ తిరుగు ప్రయాణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్చర్ దూరమైన నేపథ్యంలో, స్టోక్స్ కూడా లేకపోవడం రాజస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే!