తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​కు తగ్గిన వీక్షకుల సంఖ్య - ఐపీఎల్​ వీక్షకుల సంఖ్య

IPL viewership 2022: ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతేడాదితో పోల్చుకుంటే మొదటి వారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. దీంతో ఐపీఎల్​ 2023-2027 ప్రసార హక్కుల టెండర్​కు ముందు బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

IPL viewership
ఐపీఎల్​ 2022

By

Published : Apr 9, 2022, 6:35 AM IST

IPL viewership 2022: ఐపీఎల్​ 2023-2027 ప్రసార హక్కుల టెండర్‌కు ముందు బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్‌ వీక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోల్చుకుంటే మొదటి వారం వీక్షకుల సంఖ్య 33 శాతం పడిపోయింది. బార్క్‌ నివేదిక ప్రకారం.. నిరుడు తొలి 8 మ్యాచ్‌లకు 3.75 టీవీ రేటింగ్‌ లభించగా.. ఈసారి ఆ సంఖ్య 2.52కే పరిమితమైంది. 2020లో తొలి వారం మ్యాచ్‌లకు 3.85 టీవీ రేటింగ్‌ వచ్చింది.

2023-2027 ప్రసార హక్కులకు భారీ మొత్తం బిడ్డింగ్‌ వస్తుందని ఆశిస్తున్న బీసీసీఐకి ఇది మింగుడుపడని పరిణామమే. ఇప్పటి వరకు డిస్నీ స్టార్‌, టీవీ18-వయాకామ్‌ (స్పోర్ట్స్‌ 18), అమెజాన్‌, జీ, సోనీ సంస్థలు టెండర్‌ పత్రాల్ని కొనుగోలు చేశాయి.

ఇదీ చూడండి:మయాంక్.. నువ్వు కెప్టెన్‌వనే విషయం మర్చిపో: సెహ్వాగ్

ABOUT THE AUTHOR

...view details