టీమ్ఇండియా స్పిన్నర్.. రాజస్థాన్ టీమ్ ప్లేయర్ యుజువేంద్ర చాహల్ ఫీల్డ్‌లో ఎంత సీరియస్‌గా ఉంటాడు. అయితే ఆఫ్ ది ఫీల్డ్‌లో మాత్రం ఇతను చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మైదానంలో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే చాహల్..తన ఇన్‌స్టాలో ఏదో ఒక రీల్స్‌లో నటిస్తూ.. ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూంటాడు. ఈ క్రమంలో చాహల్‌కు సంబంధించిన ఓ వీడియోను రాజస్థాన్ టీమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఫన్నీగా, క్యూట్‌గా ఉందంటూ స్పందిస్తున్నారు.
ఇటీవల తన సహచర ఆటగాడైన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందు చాహల్.. ఓ ఫన్నీ డేటింగ్ ప్రపోజల్‌ను ఉంచాడు. బట్లర్ తన కూతురిని ఎత్తుకున్ని ఉన్న సమయంలో అతని దగ్గరికి వెళ్లిన చాహల్.. చేతిలో ఓ చిన్న పూల కుండీ పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్ చేశాడు. "జోస్ భాయ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వే నా జీవితం. గతేడాది తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేను లవ్‌లో పడిపోయాను. రోజూ నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు. ప్లీజ్ నాతో డేట్‌కు వస్తారా" అంటూ సరదాగా ప్రపోజ్ చేశాడు. ఇక చాహల్ మాటలకు కాస్త సిగ్గుపడిన బట్లర్ చిరు నవ్వుతో .. "సరే యుజీ.. నేను కచ్చితంగా వస్తాను" అంటూ బదులిచ్చాడు. దీంతో చుట్టుపక్కన వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వుకున్నారు.